CSK vs PBKS : టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైన శివం దూబే(Shivam Dube) బిగ్ వికెట్ తీశాడు. అర్ధ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న బెయిర్‌స్టో(46)ను బోల్తా కొట్టించాడు. దూబే విసిరిన బంతిని ఆడాలా? వద్దా? అనుకుంటూనే బెయిర్‌స్టో టచ్ చేశాడు. వికెట్ల వెనకాల కాచుకొని ఉన్నధోనీ అమాంతం క్యాచ్ పట్టేశాడు.
దాంతో, పంజాబ్ 83 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే డేంజరస్ రీలే రస్సో()ను శార్దూల్ బౌల్డ్ చేశాడు. 12 ఓవర్లకు పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 113 రన్స్ కొట్టింది. కెప్టెన్ సామ్ కరన్ క్రీజులోకి రాగా.. ఫినిషర్ శశాంక్ సింగ్ 9 పరుగులతో ఆడుతున్నాడు.