CSK vs PBKS : పదిహేడో సీజన్లో రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) మరో విజయం సాధించింది. చెపాక్ గడ్డపై తమకు తిరుగులేదని చాటుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)ను ఐదోసారి చిత్తుగా ఓడించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట చాహర్(2/16), హర్‌ప్రీత్(2/17)ల విజృంభణతో గైక్వాడ్ సేనను 162కే కట్టడి చేసిన పంజాబ్.. స్వల్ప ఛేదనలో ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(46), రీలే రస్సో(43)లు కీలక భాగస్వామ్యంతో పంజాబ్‌ను గెలుపు దిశగా నడిపారు. ఈ ఇద్దరూ వెనుదిరిగాక శశాంక్ సింగ్(25 నాటౌట్), కెప్టెన్ సామ్ కరన్(27 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు.
చెన్నై నిర్దేశించిన మోస్తరు లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్(0) ఓపెనర్లు ధనాధన్ ఆడారు. ఓపెనర్‌గా వచ్చిన ఇంప్యాక్ట్ ప్లేయర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(13) వరుసగా బౌండరీతో ఊపుతెచ్చాడు. అయితే.. ఐపీల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న రిచర్డ్ గ్లీసన్ ఓవర్లో షాట్ మిస్ కావడంతో గైక్వాడ్ చేతికి చిక్కాడు. దాంతో, 19 రన్స్ వద్ద పంజాబ్ తొలి వికెట్ పడినా గత మ్యాచ్ సెంచరీ హీరో జానీ బెయిర్‌స్టో(46) రీలే రస్సో(43) అటాకింగ్ గేమ్‌తో సీఎస్కే స్పిన్నర్లపై విరుచుకుపడ్డారు.
Rilee Rossouw was on song 🎶
He sets up the chase for #PBKS before departing for 43(23)
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #CSKvPBKS pic.twitter.com/nJj2QOD5ad
— IndianPremierLeague (@IPL) May 1, 2024
జడేజా, అలీ ఓవర్లో సిక్సర్లతో చెలరేగిన బెయిర్‌స్టోను.. వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైన శివం దూబే వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్(25నాటౌట్) జతగా రస్సో దంచాడు. అయితే.. 12వ ఓవర్ ఆఖరి బంతికి శార్దూల్ అతడిని బౌల్డ్ చేశాడు. అప్పటికీ 3 వికెట్లు పడినా మ్యాచ్ పంజాబ్ చేతుల్లోనే ఉంది.
ఆ సమయానికి కావాల్సిన రన్ రేటు 6 లోపే ఉండడంతో కెప్టెన్ సామ్ కరన్(27 నాటౌట్), శశాంక్‌లు తొందరపడకుండా ఆడారు. చెడ్డ బంతుల్ని బౌండరీ దాటిస్తూ చెన్నైని ఓటమి అంచున నిలిపారు. అయితే.. ముస్తాఫిజర్ మెయిడిన్ ఓవర్ వేయడంతో పంజాబ్ డగౌట్లో కొంద ఆందోళన కనిపించింది. కానీ, కొత్త బంతి తీసుకున్న మోయిన్ అలీ రన్స్ ఇచ్చాడు. ఇక గ్లీసన్ వేసిన 18 ఓవర్లో సామ్ కరన్ బౌండరీ బాదాగా.. శశాంక్ రెండు పరుగులు తీసి పంజాబ్‌కు 7 వికెట్ల విజయాన్ని అందించాడు.
Over the Ropes 🙌 💥
Shashank Singh taking #PBKS closer 👌
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #CSKvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/ZPKu4CNzwd
— IndianPremierLeague (@IPL) May 1, 2024
సొంతగడ్డపై గత మ్యాచ్‌లో రెండొందలు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి తడబడింది. పంజాబ్ కింగ్స్ బౌలర్ల ధాటికి టాపార్డర్ బ్యాటర్లు కాడి ఎత్తేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(62) ఒంటరి పోరాటం చేశాడు. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 55 రన్స్ కొట్టిన సీఎస్కేను స్పిన్నర్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రర్ దెబ్బ కొట్టాడు.
ఒకే ఓవర్లో బిగ్ హిట్టర్లు అజింక్యా రహానే(29), శివం దూబే(0)లను ఔట్ చేసి పంజాబ్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా(2)ను రాహుల్ చాహర్ ఎల్బీగా వెనక్కి పంపి సీఎస్కేను మరింత కష్టాల్లోకి నెట్టాడు. 70 పరుగులకే 4 వికెట్లు పడిన జట్టును సమీర్ రిజ్వీ(21)తో కలిసి గైక్వాడ్ ఆదుకున్నాడు. దాంతో, నిర్ణీత ఓవర్లలో వికెట్ల 7 నష్టానికి 162 రన్స్ చేసింది.