మూసాపేట, మే 2: పెండ్లయిన నెలన్నర రోజులకే నవ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట సుబ్బరావు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్పల్లి కుమ్మరి బస్తీకి చెందిన యోంజల కార్తిక్ (28).. యర్రమల్ల మంజుల (27) ఈ ఏడాది మార్చి 8న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. శనివారం ఉదయం ఇంట్లో కార్తిక్ ఉరి వేసుకుని, మంజుల విషయం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదన్నారు.