Hyderabad | హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాంద్రాయణగుట్ట ప్రాతంలో డీసీఎం ఢీకొట్టడంతో నవవధువు దుర్మరణం చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడలోని నూరీనగర్కు చెందిన ఫాతిమా బేగం(20) గురువారం రాత్రి తన భర్తతో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగివస్తుంది. ఆ సమయంలో ఓ డీసీఎం వారు ప్రయాణిస్తున్న యాక్టివా స్కూటీని ఢీకొట్టింది. అనంతరం ఆమెపై నుంచే డీసీఎం వెళ్లింది. దీంతో ఫాతిమా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే బైక్పై ఉన్న ఆమె భర్త, మరదలు గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.