Hyderabad Police | నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరవాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారి పట్ల ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పోలీసులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు.ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశాడు.
ఈ రోజు రాత్రి నగరం అంతటా 120కి పైగా కీలక పాయింట్లలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబోతున్నట్లు తెలిపాడు. ఈ తనిఖీలు కేవలం ఈ రోజుకే పరిమితం కాకుండా జనవరి మొదటి వారం అంతా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తామని, అలాగే కోర్టు ద్వారా జైలు శిక్ష మరియు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియను చేపడతామని హెచ్చరించారు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా అతివేగంగా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి ఇబ్బంది కలిగించేలా న్యూసెన్స్ చేయడం వంటి పనులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. మద్యం సేవించిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి, స్వయంగా డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ సేవలను లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి క్షేమంగా, సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ యంత్రాంగం కోరింది.
న్యూ ఇయర్ సందర్బంగా మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.
నగరంలోని 120 ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి.
జనవరి మొదటి వారం అంతా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది.
మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల… pic.twitter.com/dYUozWpo8D
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 31, 2025