సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటోలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీ ఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతించింది. అందులో భాగంగా కొత్తగా 20వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10వేల ఎల్పీజీ ఆటోలు, 10వేల సీఎన్జీ ఆటోలకు అనుమతినిచ్చింది. డీజిల్, పెట్రోల్ వాహనాలకు సంబంధించి ఆటోలకు రెటిరోఫిట్మెంట్ చేసి వాటి ఇంజన్లను ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీలుగా మార్చుకునేందుకు 25 వేల ఆటోలకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది.