Nepal Gang | హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి తనూజ రంజన్‌ను హత్య చేసి భారీగా బంగారం, నగదు దోచుకెళ్లిన ఘటన మరువకముందే.. జవహర్ నగర్ పీఎస్ పరిధిలో మరో దోపిడీకి పాల్పడింది. కౌకూర్‌లో ఓ డాక్టర్ దంపతుల కాళ్లు, చేతులు కట్టేసి మత్తు మంది ఇచ్చి దొంగతనానికి పాల్పడడింది.
వివరాల్లోకి వెళ్తే.. కౌకూర్‌లోని గల్ఫ్ ఎన్క్లిప్లో డాక్టర్ విజయలక్ష్మీ, మురళీమోహన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వాళ్ల ఇంట్లో పనిచేసే ఇద్దరు నేపాలీలు మరో ఐదుగురితో కలిసి మంగళవారం రాత్రి దోపిడీకి స్కెచ్ వేశారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. డాక్టర్ దంపతుల కాళ్లు, చేతులు కట్టేసి మత్తు మందు ఇచ్చారు. అనంతరం ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, 30 వేల నగదును దోచుకెళ్లారు.
కాగా, దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ 13 రోజుల క్రితమే డాక్టర్ దంపతుల ఇంట్లో పనిమనుషులుగా చేరారు. దోపిడీ సమయంలో ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.