మహిళా భద్రతపై దేశవ్యాప్త సైకిల్ యాత్ర
దేశంలో మహిళా సాధికారత, భద్రతపై అవగాహన పెంచేందుకు దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టిన ఆశా మాల్వియాను రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అభినందించారు.
- హైదరాబాద్ చేరుకున్న సైక్లిస్ట్ను అభినందించిన డీజీపీ
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): దేశంలో మహిళా సాధికారత, భద్రతపై అవగాహన పెంచేందుకు దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టిన ఆశా మాల్వియాను రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. మహిళలు ఒంటరిగా ఉన్నా.. ధైర్యంగా ఉండగలరనే సందేశాన్ని ఇస్తున్న ఆమెకు అభినందనలు తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆశా చేపట్టిన 25 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర.. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నది. శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా ఆమె డీజీపీని కలిశారు. మహిళల భద్రత, ‘సే నో టు డ్రగ్స్’పై విస్తృత ప్రచారం కల్పిస్తుండటాన్ని ఆయన మెచ్చుకున్నారు. 2022 నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభించిన ఆశా యాత్ర ఇప్పటివరకు ఎనిమిది రాష్ర్టాల్లో సాగింది.
డీజీపీని కలిసిన యూకే డిప్యూటీ హైకమిషనర్
డీజీపీ అంజనీకుమార్ను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిసి.. పలు భద్రతా అంశాలపై చర్చించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

