మేడ్చల్, ఫిబ్రవరి 28:విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాధికారి వసంతకుమారి సూచించారు. మేడ్చల్ పట్టణంలోని సెయింట్ పాట్రిక్ స్కూల్లో సైన్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం విజ్ఞాన మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ పరిజ్ఞానంపై ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు.అనంతరం విద్యార్థులు పలు అంశాలపై తయారు చేసిన ప్రదర్శనలను ఆమె తిలకించి,అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మహేశ్ , సింహం, కరస్పాండెంట్ స్వామిదాస్, చైర్మన్ సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ రాజలింగం యాదవ్, టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌పేట: తూంకుంట మున్సిపాలిటీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అగస్త్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సైన్స్ నమూనాల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కౌన్సిలర్ రాజ్కుమార్యాదవ్, ఎంఈవో వసంతకుమారి,అగస్త్యా ఫౌండేషన్ ప్రతినిధి శివలింగం, ఉపాధ్యాయులు వెంకటేశం, మేరీ, తిరుమలేశ్, నాగ శారద, అన్నపూర్ణ, అమీనా,రజిని, శ్రీదేవి, శైలజ, వరలక్ష్మి, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.
ఘట్కేసర్: ఘట్కేసర్లోని జడ్పీ బాలుర,బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు పాపిరెడ్డి, అనిత, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు,విద్యార్థులు ఉన్నారు.
మేడ్చల్ రూరల్:మేడ్చల్ మండలంలోని నూతన్‌కల్ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అగస్త్యా ఇంటర్నేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ నమూనాలను ప్రదర్శిం చి విద్యార్థులకు వివరించారు.అగస్త్యా ఫౌండేషన్ చేస్తున్న కృషికి అభినందనీయమని ప్రిన్సిపాల్ కొండయ్య అన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత జీవన్,పీఏసీఎస్ చైర్మన్ సురేశ్‌రెడ్డి,ఉపసర్పంచ్ప్రభాకర్రెడ్డి,వార్డు సభ్యు లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లోని ఉన్నత పాఠశాలలో క్రై స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు తయా రు చేసిన పలు సైన్స్ ఆవిష్కరణలను మేయర్ కావ్య పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆర్గనైజన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై అనిల్‌కుమార్‌యాదవ్, క్రై సంస్థ ఆర్గనైజర్ హిమబిందు, రిటైర్డ్ డీఎస్ఓ ప్రభాకర్, పాఠశాల ప్రిన్సి పాల్ కె. శేఖరయ్య, పాఠశాల సిబ్బంది, క్రై సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కీసర: కీసరలోని అరుంధతి విద్యాలయంలో నేషనల్ సైన్స్‌డే, ఫుడ్ ఫెస్టివల్స్‌ను నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. వెజ్, నాన్‌వెజ్ వంటకాలను కూడా విద్యార్థులు తయారు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.