హైదరాబాద్ : మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఎన్హెచ్ఎం డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) స్కీమ్‌లో 78 క్యాడర్లలో పనిచేస్తున్న 17,541 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
వీరంతా పల్లె దవాఖాన, యూపీహెచ్‌సీల్లో వైద్యులుగా, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు, సెకండ్ ఏఎన్ఎం, కాంటిజెంట్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, జీతాలు పెంచితే.. తెలంగాణలో మాత్రం జీతాలు ఇవ్వలేకపోతున్నారంటూ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు.
3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని NHM డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించిన నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న NHM పథకంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ 17 వేల మంది ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు బంద్
పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగులను… pic.twitter.com/QoQ6pGGiqe
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2025