రామంతపూర్, ఫిబ్రవరి 22: రామంతాపూర్ ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజీ ప్రొఫెసరు గదడుగు శ్రీనివాసులు డాక్టర్ జీఎల్ఎన్ శాస్తి్ర స్మారక జాతీయ అవార్డును అం దుకున్నారు. పూణేలో 27వ జాతీయ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి రెం డు రోజుల సదస్సుకు శనివారం ఆయన కలశాల నుంచి వెళ్ళారు. ఈ సదస్సుల్లో జీవన శైలి వ్యాధులు, మాతా శిశు ఆరోగ్య అంశాలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు హోమియో విశిష్టత వంటి అంశాలపై 60 మంది ప్రొఫెసర్లు వారి శాస్త్రీయ పత్రాలను సమర్పిసున్నా రు.
ప్రముఖ హోమియో వైద్యులు మెదడు వాపు వ్యాధి హోమియో నివారణ మందులను కనిపెట్టిన డాక్టర్ జీఎల్ఎన్ శాస్త్రి గారి మెమోరియల్ జాతీయ అవార్డును జేఎస్పీ ఎస్ హోమియో వైద్య కళాశాల పీజీ ప్రొ. శ్రీ నివాసులుకు ప్రదానం చేశారు. ఆయన హో మియో వైద్యానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందించినట్టు తెలిపారు. డాక్టర్ శ్రీనివాసులు 34 ఏళ్లు ఆయుష్ డిపార్ట్మెంట్ తన సేవల ను వివిధ స్థాయిలలో హోమియో వైద్య విద్య, పరిశోధనలు, వివిధ రకాల వ్యాధుల చికిత్సకు తన సేవలను అం దించారు. వైరల్ ఇన్ఫెక్షన్లో ప్రధానంగా జపనీస్ (మెదడు వాపు వ్యాధి)లో హోమియో మందులు పని తీరును అత్యాధునిక లేబరేటరీలో పరిశోధనల ద్వారా నిరూపించారు. వీరి పరిశోధన పత్రాలు అమెరికన్, ఇటాలియన్, బ్రిటిష్ జర్నల్స్‌లో ప్రచురించబడినవి. గతం లో వీరికి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డును 2004 రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారు.
వీరి విద్యార్థులు అత్యున్నత పదవులలో..
హోమియో వైద్యానికి నాలుగు దశాబ్దాల పాటు చేసిన విశిష్ట సేవలకు జాతీయ అవార్డును డాక్టర్ శ్రీనివాసులుకు మహారాష్ట్ర హెల్త్ యూనివర్సిటీ సైన్స్ డిపార్ట్మెంట్ వీసీ డాక్టర్ మిలిండ్ నీకుబ్ చేతుల మీదుగా పూణె సదస్సులో అందుకున్నారు. వివిధ రాష్ర్టాల నుం చి 1200 మంది హోమియో వైద్యులు ఈ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. తెలుగు రాష్ర్టాల నుంచి 50 మంది డాక్టర్లు సదస్సుకు హాజరు అయినట్లు ఆయన తెలిపారు.