సిటీబ్యూరో, జూన్ 13(నమస్తే తెలంగాణ) : పదేండ్ల కాలంలో.. 34 సార్లు రక్తదానం చేసి… ఎందరో ప్రాణాలు నిలిపాడు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన నరేశ్. బీ నెగిటివ్ బ్లడ్ కావాల్సిన వారికి అందుబాటులో ఉంటూ.. అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ.. తన వంతు సమాజ సేవ చేస్తున్నాడు.
అదే విధంగా ప్రత్యేక రోజుల్లోనూ రక్త దాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వరల్డ్ డోనర్స్ డే సందర్భంగా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ రక్తాన్ని అందించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నాడు. తనలాగే సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చేవారు 9652943769కు నంబర్ ద్వారా సంప్రదించాలని సూచిస్తున్నాడు.