వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 18 : దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు. ఎన్ఐఆర్డీ రాజేంద్రనగర్లో బుధవారం ప్రపంచ గ్రామీణ అభివృద్ధి దినోత్సవం సందర్భంగా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుస్థిరత్వ అభివృద్ధి లక్ష్యాలను స్థానికరణ, చొరవ వంటి అట్టడుగు స్థాయిలో వినూత్న పద్ధతులను నెరవేర్చడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రొఫెసర్ అనిల్ కే గుప్తా మాట్లాడుతూ చట్టంలో ఆదాయ అసమానతలు తదితర అంశాలపై ఆయన వివరించారు. ఇంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ మోడల్ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన ప్రతిపాదించారు.
దేశంలోని సమ్మిళిత అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.ఆంధ్రప్రదేశ్ డీజీ డాక్టర్ చంద్రశేఖర్ సమగ్ర గ్రామీణ అభివృద్ధి సాధించడానికి వివిధ రూపకల్పన గ్రామీణ అభివృద్ధి కేంద్రబిందువుగా ఉండాలని అన్నారు. ఇండోనేషియా, శ్రీలంక , మలేషియా, వియత్నం, మయన్మార్, థాయ్లాండ్, పీజీ ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ తదితర 11 సభ్యదేశాలు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై.. ప్రధానంగా గ్రామీణ అభివృద్ధిలో చైతన్యం పల్లెలు అభివృద్ధి చెందే విధానం ప్రభుత్వం చేపడుతున్న పలు అంశాలపై అభినందించారు.