వెంగళరావునగర్, నవంబర్ 3: అది కల్తీ కల్లు తయారీ కర్మాగారం. కల్లు కాదది.. గుట్టుగా సాగుతున్న కల్తీ కల్లు తయారీ దందా. కల్తీ కల్లు తయారీ కర్మాగారంపై దాడులు నిర్వహించి పోలీసులు గుట్టు రట్టు చేశాతదరు. యూసుఫ్‌గూడ కల్లు కాంపౌండ్‌లో ఆరోగ్యానికి అత్యంత హాని చేసే కెమికల్స్‌తో కల్లును తయారు చేస్తున్నట్లు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు నార్కొటిక్స్ పోలీసులు, మధురానగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ వార్డు కార్యాలయం వెనుకనున్న కల్లు కాంపౌండ్‌లో గుట్టుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా కల్తీ కల్లు తయారీ కొనసాగుతుంది. కల్లు కాంపౌండ్ యజమాని అశోక్ గౌడ్(60), కల్లు కాంపౌండ్ మేనేజర్ యాదయ్య గౌడ్ కలిసి కల్లు కంపౌండ్‌లో కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. జోగిపేట నుంచి ఒరిజనల్ ఈత కల్లును, సంగారెడ్డి, కడ్తాల్ ప్రాంతాల నుంచి తాటికల్లును తెచ్చి ఇక్కడి కాంపౌండ్‌లో సోడియం కార్బౌనైట్, షాక్రీన్, ఖట్టా, చక్కెరలను పెద్ద పెద్ద డ్రమ్ముల్లో కలిపి కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. 700 ఎం.ఎల్. కల్తీ కల్లును ఒక్కో సీసాలో నింపి రూ.50లకు విక్రయిస్తున్నట్లు పోలీసు విచారణలో మేనేజర్ యాదయ్య గౌడ్ అంగీకరించాడు.
కల్లు కాంపౌండ్ నుంచి 50 కిలోల సోడియం బై కార్బొనైట్ టెక్నికల్ గ్రేడ్ టాటా కెమికల్ పౌడర్ బస్తా, 25 కిలోల వైట్ పౌడర్ బస్తా, 2 కిలోల షాక్రీన్ బ్యాగ్, 5 కిలోల ఖట్టా బ్యాగు, 650 కిలోల చక్కెర బరువున్న మూడు బస్తాలు, 200 లీటర్ల ఈత కల్లు, 200 లీటర్ల తాటి కల్లు, 50 లీటర్ల కల్తీ కల్లు ్ల, గుర్తు తెలియని 200 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామని ఈ మేరకు కేసు కల్లు కాంపౌండ్ యజమాని అశోక్ గౌడ్, మేనేజర్ యాదయ్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయినాథ్ రెడ్డి తెలిపారు.