తెలుగు యూనివర్సిటీ, జూన్ 16: రైలులో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్ సీఐ జె. ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి నగరం మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రమణమ్మ(50), గోవింద్(38)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా 26.684 కేజీల గంజాయి బయటపడింది. పట్టుబడిన గంజాయి విలువ రూ. 6.50 లక్షలు ఉంటుంది. నిందితులను అరెస్టు చేసి, గంజాయి సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో సిబ్బంది మురళి, కోటేశ్వరరావు, అశోక్, దుర్గారావు, రంగరావు తదితరులు పాల్గొన్నారు.