తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 25: దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా-2025 ఆరవ లక్కీ డ్రా లక్డీకాపూల్‌లోని కున్ హ్యూందాయ్ షోరూమ్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు.
లక్కీ డ్రాలో కున్ హ్యూందాయ్ సీఓఓ ఎస్.అశోక్ యాదవ్, హ్యూందాయ్ మోటార్స్ మార్కెటింగ్ మేనేజర్ రాజేష్ సాహూ, నమస్తే తెలంగాణ ఆపరేషన్స్ సీజీఎం చేర్మాల శ్రీనివాస్, అడ్వైర్టెజ్‌మెంట్ జీఎం సురేందర్‌రావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి పాల్గొని బొనాంజా విజేతలను ప్రకటించారు. ప్రథమ బహుమతికి పి.మహేష్‌బాబు (కూపన్ నంబర్ 011819), ద్వితీయ బహుమతికి గురిఫాల కెనార్ (012776), మూడవ బహుమతికి చైతన్య (015989), నాల్గవ బహుమతికి సుమలత(011930) ఎంపికైనట్లు వారు ప్రకటించారు.
దసరా షాపింగ్ బొనాంజాకు టైటిల్ స్పాన్సర్ గా సీఎంఆర్ షాపింగ్ మాల్, మెయిన్ స్పాన్సర్‌గా అల్లకాస్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్‌సీ, పవర్డ్ బై.. ఆల్మండ్ హౌజ్, ప్రొటీన్ పార్టనర్‌గా వెన్‌కాబ్ చికెన్, ఇతర స్పాన్సర్లుగా.. హర్ష టోయాటా, కున్ హ్యూందాయ్, వరుణ్ మోటార్స్, మానేపల్లి జువెలర్స్, శ్రీ సిల్క్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలివిజన్ పార్టనర్‌గా టీ న్యూస్, డిజిటల్ పార్ట్నర్గా సుమన్ టీవీ వ్యవహరిస్తున్నారు.
కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు
సరైన సమయంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల వ్యాపార సంస్థలకు ఎంతో మేలు కలిగింది. ఇటీవల ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్న వేళ ఈ దసరా బొనాంజా మరింత తోడ్పాటును అందించింది.
– ఎస్.అశోక్ యాదవ్, సీఓఓ, కున్ హ్యూందాయ్
వినియోగదారులకు మేలుచేసే బొనాంజా
ఇటీవల కేంద్రం జీఎస్టీ శ్లాబులను తగ్గించడంతో కార్ల కొనుగోలుదారులకు ఇదే సరైన సమయం. బొనాంజా ఆఫర్స్ సేల్స్‌కి మరింత ఊతమిస్తాయి. ఈ సంస్థలతో మాకు 10 సంవత్సరాల అనుబంధం ఉంది. ఇది వినియోగదారులకు ఎంతో మేలు చేసే బొనాంజా. పది సంవత్సరాలుగా బొనాంజా ఆఫర్లు ఇస్తుండటం సంతోషంగా ఉంది.
– రాజేష్ సాహూ, మార్కెటింగ్ మేనేజర్, హ్యూందాయ్ మోటార్స్
బొనాంజాకు అనూహ్య స్పందన వస్తోంది
బొనాంజా నిర్వహణకు సహకరిస్తున్న సంస్థల అనుబంధం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. బొనాంజాతో ప్రజలు డబుల్ ఆఫర్లను అందుకుంటున్నారు. షోరూమ్‌ల కూపన్లు, జీఎస్టీ తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలి. దశాబ్దకాలంగా బతుకమ్మ-దసరా పండుగల నేపథ్యంలో వినియోగదారులను ఉత్సాహాపరిచేలా బహుమతులను అందజేస్తూ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే చేపట్టిన బొనాంజాకు అనూహ్య స్పందన వస్తుంది.
– చేర్మాల శ్రీనివాస్, ఆపరేషన్స్ సీజీఎం, నమస్తే తెలంగాణ