సిటీబ్యూరో అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)/ మారేడ్‌పల్లి : కొనుగోలుదారుల ఇండ్లలో పండుగకు ముందే “నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే” గిఫ్టు సంబురాలు మొదలయ్యాయి. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఈనెల 18వరకు నిర్వహించే దసరా షాపింగ్ బొనాంజా కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం మూడవ రోజు ఐదుగురు లక్కీడ్రా విజేతలను ఎంపిక చేశారు. ఈ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్లో మూడవ లక్కీ డ్రాను నిర్వహించారు. వినియోగదారులు, స్పానర్ల సమక్షంలో సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ, హోప్ అడ్వర్టయిజింగ్ డైరెక్టర్ కేఎస్ రావు, నమస్తే తెలంగాణ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రవీణ్‌కుమార్, నమస్తే తెలంగాణ అడ్వర్టయిజ్మెంట్ విభాగం ఏజీఎంలు రాజిరెడ్డి, రాములు, మేనేజర్ సందీప్ చేతుల మీదుగా ఐదురుగు విజేతలను ప్రకటించారు.
సికింద్రాబాద్ ప్యాట్నీ చౌరస్తాలోని సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్లో నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో తీసిన లక్కీ డ్రాలో మొదటి బహుమతి 32 ఇంచుల టీవీ ఆదిశేషు గెలుచుకున్నారు. రెండవ బహుమతి మొబైల్ ఫోన్‌ను విజయ్, మూడవ బహుమతి మైక్రో ఓవెన్‌ను వి.ఓంకారం, నాల్గవ, ఐదవ బహుమతులు గిఫ్ట్ ఓచర్లను జి.సత్తయ్య, జగదీశ్ గెలుచుకున్నారు.
అందరూ మెచ్చే విధంగా, వినియోగదారులకు నాణ్యమైన వస్ర్తాలను సరసమైన ఆఫర్లతో తక్కువ ధరకే అందిస్తున్నాం. దసరా పండుగ సందర్భంగా “నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే” ఆధ్వర్యంలో దసరా షాపింగ్ బొనాంజా నిర్వహించడం, అందులో సీఎంఆర్ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉన్నది. చిన్నారులు, మహిళలకు ప్రత్యేకంగా రకరకాల దుస్తులను రూ.200 నుంచి మొదలుకొని అందుబాటులో ఉంచాము. 16 సీఎంఆర్ బ్రాంచ్‌లు ఉన్నాయి. షాపింగ్ చేయండి.. లక్కీ డ్రాలో పాల్గొనండి.. బంపర్ డ్రాలో కారును కూడా గెలుచుకోవచ్చు.
– ఎ.సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్, సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ తెలంగాణ
“నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే” ఆధ్వర్యంలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజాలో క్రియేటివ్ పార్టర్గా వ్యవహరిస్తున్నాం. పారదర్శకంగా.. ఇలా ప్రతిరోజు అందరి సమక్షంలో డ్రా తీయడం నిజంగా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడం ఇటు కొనుగోలుదారులకు, అటు ప్రకటన దారులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.
– కె.ఎస్ రావు, హోప్ అడ్వర్టయిజింగ్ డైరెక్టర్
గత పది సంవత్సరాలుగా “నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే” ఆధ్వర్యంలో దసరా బొనాంజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు లక్కీ డ్రాలో ఐదుగురు చొప్పున విజేతలను ప్రకటిస్తున్నాం. ఈ బంపర్ డ్రాలో కారును గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్, నమస్తే తెలంగాణ