బేగంపేట్ సెప్టెంబర్ 26: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినియోగదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రిల సంయుక్తాధ్వార్యంలో శుక్రవారం బేగంపేట్‌లోని వరుణ్ మోటార్స్‌లో దసరా బొనాంజా 7వ లక్కీ తీశారు. ముఖ్య అతిథులుగా బేగంపేట్ వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఆర్సీ రాజు, నమస్తే తెలంగాణ జీఎం ఎన్ సురేందర్‌రావు హాజరై.. లక్కీడ్రా విజేతలను ప్రకటించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ… గత పదేండ్లుగా నమస్తే తెలంగాణ దిన పత్రికతో కలిసి పనిచేస్తూ వ్యాపారుల్లో నమ్మకాన్ని, నూతన ఉత్సహాన్ని నింపేందుకు కృషి చేస్తున్నందుకు గర్విస్తున్నట్టు తెలిపారు.
వినియోగదారులకు న్యాయబద్ధంగా అందరి సమక్షంలో విజేతలను ప్రకటిస్తూ బహుమతులను అందజేస్తున్నామని తెలిపారు. శుక్రవారం బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో వీ నరేష్.. మొదటి బహుమతిగా టీవీ గెలుచుకోగా, రెండవ బహుమతి ఏ రాథాకృష్ణ స్మార్ట్‌ఫోన్ గెలుచుకున్నారు.మూడవ బహుమతి గిఫ్ట్ వోచర్‌ను ఈశ్వర్ గెలుచుకోగా నాలుగవ బహుమతి గిఫ్ట్ హ్యాంపర్ సందీప్ గెలుచుకున్నారు. ఈనెల 27వ తేదీ వరకు కూపన్లను డ్రా బాక్స్‌లో వేయవచ్చు అని నమస్తే తెలంగాణ జీఎం ఎన్ సురేందర్‌రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ జనరల్ మేనేజన్ కృష్ణకుమార్, మారుతి సుజుకి టీఎస్ఎం కౌషిక్ సెల్వరాజ్, వరుణ్ మోటార్స్ ప్రతినిధులు.. సుజని, రామ్‌కుమార్, మణి, బాల్‌రాజ్, సుమంత్‌తో పాటు నమస్తే తెలంగాణ ఏడీవీటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి, డిప్యూటీ మేనేజర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. దసరా షాపింగ్ బొనాంజాకు టైటిల్ స్పాన్సర్‌గా సీఎంఆర్ షాపింగ్ మాల్, మెయిన్ స్పాన్సర్‌గా అల్లకాస్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్‌సీ, పవర్డ్ బై.. ఆల్మండ్ హౌజ్, ప్రొటీన్ పార్టనర్‌గా వెన్‌కాబ్ చికెన్, ఇతర స్పాన్సర్లుగా.. హర్ష టోయాటా, కున్ హ్యూందాయ్, వరుణ్ మోటార్స్, మానేపల్లి జువెలర్స్, శ్రీ సిల్క్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలివిజన్ పార్టనర్‌గా టీ న్యూస్, డిజిటల్ పార్ట్నర్గా సుమన్ టీవీ వ్యవహరిస్తున్నారు.
పదేండ్లుగా నమస్తే తెలంగాణ దిన పత్రిక యాజమాన్యం వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు దసరా బొనాంజా ద్వారా బహుమతులను అందించడం అభినందనీయం. ఈ పత్రికతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. న్యాయబద్ధంగా లక్కీ డ్రాలు తీసి విజేతలైన వారికి బహుమతులను అందించడం ద్వారా కొనుగోలుదారుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. ఇలాంటి లక్కీ డ్రాల ద్వారా వివిధ వ్యాపారాల్లో సేల్స్ కూడా మరింతగా పెరుగుతున్నాయి. కస్టమర్లకు ఎల్లప్పుడూ నాణ్యమైన సేవలు అందించడలో వరుణ మోటార్స్ ముందువరుసలో ఉంటుంది.
– ఆర్సీ రాజు, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, వరుణ్‌మోటార్స్
నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యం చేస్తున్న ఈ లక్కీ డ్రాల వలన సేల్స్‌కి మరింత ఊతం ఇచ్చినైట్లెంది. ఇది కస్టమర్లకు మంచి మోటివేషన్‌గా ఉంది. ప్రస్తుతం తగ్గిన జీఎస్టీ వలన మారుతి సుజీకి కంపెనీకి చెందిన కార్ల ధరలు తగ్గడంతో మా షోరూంలో కార్ల కొనుగోళ్లు పెరిగాయి. వీటికి తోడు నమస్తే తెలంగాణ లక్కీడ్రా కూడా తోడైంది. రెండు విధాలుగా కస్లమర్లకు మంచి బెనిఫిట్స్ అందిస్తున్నాం. దీంతో కస్టమర్లు కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు.
– కృష్ణకుమార్, జనరల్ మేనేజర్, వరుణ్ మోటార్స్