శామీర్ పేట, జూలై 24: నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థుల మృతి ఘటనపై శామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారం ఎదుట పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని కోరారు. దేశ వ్యాప్తంగా ఈ అంశంపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత వ్యవస్థలు స్పందించకపోవడం పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో ప్రాంగణం
హోరెత్తింది.