మలక్ పేట, జూలై 4: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు నల్గొండ శ్రీనివాస్ ఆర్టీసీ ఎండి సజ్జినారుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీలో దివ్యాంగులకు అనుకూలమైన నాలుగు శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని బస్ స్టేషన్లలో దివ్యాంగులకు అనుకూలంగా వసతులు కల్పించాలని, వికలాంగులకు కేటాయించిన సీట్లు వారికే దక్కేలా కండక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. వారి విన్నపాలపై సానుకూలంగా స్పందించిన ఎండీ సజ్జనార్ ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీహెచ్ఎస్ఎస్ అధ్యక్షులు గుత్తికొండ కిరణ్, సంఘం నాయకులు నాగరాజు, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.