బంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రూ.3.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలాల ఆధునీకరణ పనులను సోమవారం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ..నగరంలో వరదనీటి సమస్యలను పరిష్కరించేందుకు నాలా డెవలప్మెంట్ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టామన్నారు. వరదనీటి ప్రవాహాలను తట్టుకునేలా నాలాలను పటిష్టం చేసేందుకు పనులు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్భన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ విప్లవ్‌కుమార్, స్థానిక కార్పొరేటర్ కవితారెడ్డి,డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, నాయకులు రవి, మాదాస్ ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.