Karate Championship | ఉప్పల్, ఫిబ్రవరి 12 : విశాఖపట్నంలో జరిగిన ప్రతిష్టాత్మక 2వ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ (Karate Championship) లో నాచారానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేపట్టారు. బంగారు, వెండి, కాంస్య పథకాలను సాధించి అబ్బురపరిచారు. ఈ పోటీలలో భారతదేశం, నేపాల్, శ్రీలంక, చైనా, సింగపూర్, మలేషియా క్రీడాకారులు హాజరై పోటీపడ్డారు.
నాచారానికి చెందిన డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు షిహాన్ నల్లా శివ ప్రసాద్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో తమ ప్రతిభను, సాంకేతికతను ప్రదర్శించారు. ఎ. సారా, ఎన్.కీర్తి, డి .కార్తీక, ఎ. యువన్, కె. టియ, కె.చందన్, ఎన్. నితేష్, వి.సాకేత్, సాహితీ, అనిషా, ప్రణవ్ తమ ప్రతిభతో బంగారం, వెండి, కాంస్య పతకాలు సాధించారు.
విజేతలకు పతకాలు, సర్టిఫికెట్ల ప్రదానంతో అవార్డు వేడుక గ్రాండ్గా ముగిసింది. ఛాంపియన్షిప్ సాధించడంలో మద్దతు ఇచ్చినందుకు కోచ్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ