అడవుల పరిరక్షణకు అంకితభావంతో పని చేయాలి : మంత్రి ఐకే రెడ్డి
Forest conservation | అడవుల పరిరక్షణకు అటవీ శాఖ అధికారులు అంకితభావంతో పని చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్, జనవరి 3 : అడవుల పరిరక్షణకు అటవీ శాఖ అధికారులు అంకితభావంతో పని చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, (పీసీసీఎఫ్) ఆర్.శోభ, ఇతర అధికారులు అరణ్య భవన్లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంపునకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు.
అటవీ అధికారులు, సిబ్బంది అడవుల పరిరక్షణకు నిరంతరం పని చేస్తున్నారని అభినందించారు. నూతన సంవత్సరం సందర్భంగా అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి (పీసీసీఎఫ్) ఆర్.శోభ కేక్ కట్ చేసి, న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
కార్యక్రమంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు ఎం.సీ. పర్గెయిన్, వినయ్ కుమార్, ఏ.కే.సిన్హా, సునీత భగవత్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

