RS Praveen Kumar | కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలి. రేవంత్ రెడ్డిని ఏడాది పాటు జైలుకు పంపాలని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ వెంటనే కేసులు నమోదు చేయాలి. మీనాక్షి నటరాజన్‌కు ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా..? సాధారణ పౌరులు తప్పు చేస్తే ఒక న్యాయం, అధికారులు, నాయకులు తప్పు చేస్తే వారికి ఒక న్యాయమా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టిస్ కి పాల్పడ్డారన్నారు.
రేవంత్ రెడ్డికి వంగూరు మండలం సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో ఒక ఓటు, కొడంగల్‌లో మరో ఓటు ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గత ఎన్నికల్లో కుటుంబ సమేతంగా కొడంగల్‌లో ఓటు వేశారు. రెప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం, సెక్షన్ 17 ప్రకారం ఎవరికి రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉండకూడదు. సెక్షన్ 18 ప్రకారం వ్యక్తికి ఒకే నియోజకవర్గంలో రెండు ఓట్లు ఉండొద్దు. ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తే సెక్షన్ 31 ప్రకారం విచారణ జరపాలి. నేరం రుజువైతే ఒక ఏడాది జైలు. జరిమానా లేదా రెండు విధించవచ్చన్నారు.
రేవంత్ రెడ్డికి కొడంగల్‌లో, కొండారెడ్డి పల్లిలో రెండు చోట్ల ఓటు ఉంది. TES0274035. ఇదే ఎపిక్ నెంబర్‌తో ఉంది. సీరియల్ నెం 974 కొడంగల్, సీరియల్ నెం 601 కొండారెడ్డి పల్లిముఖ్యమంత్రి హోదాలో వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉన్నారు. రేవంత్ రెడ్డి 31 సెక్షన్ ప్రకారం నేరస్థుడే.ఫాక్ట్ చెక్ అనే సంస్థ ఎలక్షన్ కమిషన్ స్థానంలో వివరణ ఇస్తుంది.అసలు ఫాక్ట్ చెక్ సంస్థ ఎక్కడిది..? ఎందుకు అలా ఎన్నికల కమిషన్ కాకుండా ఫాక్ట్ చెక్ అనే సంస్థ సీఎం ఆఫీస్ నుండి స్పందించింది..?తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆర్టికల్ 324 ప్రకారం, పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్ట్ ప్రకారం వెంటనే కేసు నమోదు చేయాలి. అయితే ఎన్నికల కమిషన్ కాకుండా, ఫాక్ట్ చెక్ సంస్థ నుండి వివరణ ఇచ్చారు. తర్వాత రాత్రికి రాత్రే ఆ పోస్ట్ డిలీట్ చేశారు. ఫాక్ట్ చెక్ సంస్థపై కేసు నమోదు చేయాలన్నారు.
నిన్న సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నాగర్ కర్నూల్ కలెక్టర్ రేవంత్ రెడ్డికి ఎలాంటి ఓటు లేదని చెప్పారు. కానీ ఇప్పటికీ ఓటు ఉంది. 2023లో కొడంగల్‌లో అఫిడవిట్ లో కొడంగల్ ఓటరునే అని చెప్పారు. మరి కొండారెడ్డి పల్లి ఓటు ఏమైంది..? కొండారెడ్డి పల్లెలో ఓటు హక్కు ఎపుడు తొలగించారు..? రేవంత్ రెడ్డి సంతకం చేశారా..? ఓటు తొలగించే ముందు రేవంత్ రెడ్డికి నోటీసు ఇచ్చారా..? ఫారం 8 ప్రకారం, కొండారెడ్డి పల్లిలో ఓటు తొలిగించాలని రేవంత్ రెడ్డి ధరఖాస్తు చేసుకున్నారా..? ఫారం- 7 ఆధారంగా ఓటు ఎపుడు తొలగించారో జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలన్నారు.
రేవంత్ రెడ్డి ఫారం 7 మీద సంతకం చేయకుండా ఎలా ఓటు తొలగిస్తారు..? లేదంటే.. జిల్లా కలెక్టర్ కూడా బీఎన్ఎస్ ప్రకారం విలువైన ఆధారాన్ని నాశనం చేసిన నేరం కింద నేరస్థులవుతారన్నారు. తెలంగాణలో ఎన్నికల కమీషన్ నడిపేది ఎవరు..? రేవంత్ రెడ్డి.. ? సుదర్శన్ రెడ్డా..? అనే దానిపై సుదర్శన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి బదులు, సీఎం ఆఫీస్ నుండి ఫాక్ట్ చెక్ ఎందుకు స్పందించింది..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
ఎవడీ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ.. వాడి మీద తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయాలి
ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ వాడికి జాతీయ ఎన్నికల సంఘం తరఫున వకాల్తా పుచ్చుకునే అర్హత ఎక్కడిది
ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ మీద కేసు నమోదు చేసి జైలుకి పంపించాలి
డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ మీద కూడా… https://t.co/bQorFk8CxK pic.twitter.com/LjeXMqpNvy
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2026