హైదరాబాద్ : వరంగల్ సెంట్రల్ జైలును అక్కడినుండి మార్చి ఆ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. ట్విట్టర్ ద్వారా ఎంపీ స్పందిస్తూ.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. అదేవిధంగా చంచల్‌గూడ జైలును కూడా ఇక్కడి నుండి తరలించాలని ఎంపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జైలుకు చెందిన 45 ఎకరాల సువిశాల స్థలాన్ని విద్య లేదా ఉపాధి కోసం వినియోగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఉదాహరణకు హార్డ్‌వేర్ పార్కును ఏర్పాటు చేయడం వంటి యోచించాలన్నారు. ఇది హైదరాబాద్ సౌత్ జోన్ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఈ మేరకు వివరణాత్మక రిప్రజెంటేషన్‌ను ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు.
For example, setting up a hardware park. This will benefit people of Hyderabad’s South Zone immensely. Will send a detailed representation to @TelanganaCMO for his consideration as well 2/2
— Asaduddin Owaisi (@asadowaisi) June 12, 2021