Muta Gopal | ముషీరాబాద్ మార్చి 3. మసీదుల వద్ద సౌకర్యాల కల్పనకు కృషి చేయనున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం ముషీరాబాద్ ఏక్ మినార్ మసీదును సందర్శించి రంజాన్ సందర్భంగా ఏర్పాట్లు తీరును పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. రంజాన్ సందర్భంగా మసీదులు, ప్రార్థన స్థలాల వద్ద వివిధ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. మంచినీరు, విద్యుత్తు, రోడ్లు, పారిశుధ్య సమస్యలు తలెత్తలకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ , ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్, ఎయిర్టెల్ రాజు, డి శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.