ఘట్కేసర్, మార్చి 10: ఘట్ కేసర్ పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ నేత, మున్సిపల్ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాలు యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఘట్ కేసర్ పట్టణ ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
కొన్ని వార్డుల్లో పారిశుధ్య పనులు సరిగ్గా లేక ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉందని, దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ముదిరాజ్, మున్సిపల్ ఉపాధ్యక్షుడు నాగరాజు, డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు తదితరులు ఉన్నారు.