e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home హైదరాబాద్‌ పిల్లల్లో ఎంఐఎస్‌ డిజార్డర్‌

పిల్లల్లో ఎంఐఎస్‌ డిజార్డర్‌

పిల్లల్లో ఎంఐఎస్‌ డిజార్డర్‌
  • కరోనా తరువాత పొంచివున్న ప్రమాదం
  • సకాలంలో చికిత్స ఇస్తే 98శాతం రికవరీ
  • అపోలో వైద్యనిపుణుడు డాక్టర్‌ సురేశ్‌కుమార్‌

సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): పిల్లల్లో కరోనా ప్రభావం తక్కువ. 80-90 శాతం మందిలో అసలు వైరస్‌ వచ్చినట్టు కూడా తెలియదు. కేవలం ఒక్కశాతం మందిలోనే నిమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరస్‌ వచ్చిపోయిన నెల తర్వాత మల్టీ ఇన్‌ఫ్రమెట్రి సిస్టమ్‌ డిజార్డర్‌ (ఎంఐఎస్‌-సీ) ప్రభావం పిల్లల్లో అధికంగా కనిపిస్తుంది. ఎంఐఎస్‌-సీ వల్ల కరోనా వచ్చిపోయిన పిల్లల్లో ప్రధాన అవయవాలు దెబ్బతింటున్నాయని అపోలో క్రెడల్‌ వైద్యనిపుణుడు డాక్టర్‌ సీ సురేశ్‌కుమార్‌ తెలిపారు. కరోనా ఫస్ట్‌వేవ్‌లో కూడా కరోనాతో కాకుండా వైరస్‌ వచ్చిపోయిన తర్వాత పిల్లలు ఎంఐఎస్‌ ఇన్ఫెక్షన్‌కు ఎక్కువగా గురయ్యారని, రెండోదశలో కూడా అదే జరుగుతున్నదని పేర్కొన్నారు. మూడోదశలో కొవిడ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపితే.. వైరస్‌ కంటే కూడా ఎంఐఎస్‌ డిజార్డర్‌ సమస్యలే అధికంగా ఉండే అవకాశాలున్నట్టు వెల్లడించారు. దీనిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే 98 శాతం రికవరీ సాధ్యమని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలున్న పిల్లల్లో ఈ రియాక్షన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.

ఇతర ఇన్ఫెక్షన్స్‌ ప్రభావమే ఎక్కువ

పిల్లల్లో కరోనా వైరస్‌ కంటే దాని తర్వాత వచ్చే రియాక్షన్స్‌, ఇన్ఫెక్షన్స్‌ ప్రభావమే ఎక్కువ. హార్ట్‌, లివర్‌, కిడ్నీ సమస్యలతోపాటు ప్రిమెచ్యురిటీ వంటి పిల్లల్లో అధిక సమస్యలు వస్తాయి. కరోనా ఫస్ట్‌వేవ్‌, సెకండ్‌ వేవ్‌లను పరిశీలిస్తే కరోనా నుంచి పిల్లలు మూడునాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారు. 80-90 శాతం మంది పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీనివల్ల పిల్లలకు వైరస్‌ వచ్చిన విషయం తల్లిదండ్రులకు తెలియదు. వైరస్‌ వచ్చిపోయిన తర్వాతే పిల్లలు ఎక్కువగా హైపర్‌ ఇన్‌ఫ్రమెట్రీ సిండ్రోమ్స్‌ వంటి రియాక్షన్స్‌కు గురవుతున్నారు. దీనిని సకాలంలో గుర్తించకపోతే హార్ట్‌, లంగ్స్‌పై వైరస్‌ ప్రభావం పడి మరణాలు సంభవించే అవకాశం ఉన్నది. అందుకని పిల్లల్లో మూడు నుంచి ఐదు రోజులైనా జ్వరం, వాంతులు, విరేచనాలు, ఆయసం వంటివి తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మెడికల్‌ టెస్టులు చేయించి చికిత్స మొదలుపెట్టాలి. పిల్లల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.

ప్రభావితమయ్యే అవయవాలు

  • గుండె
  • ఊపిరితిత్తులు
  • మెదడు
  • కిడ్నీలు
  • కాలేయం
  • ఎంఐఎస్‌-సీ

లక్షణాలు

  • కండ్లు ఎర్రబడటం (కంజంటివేటర్స్‌)
  • లింపోడ్స్‌ పెరగడం
  • (గొంతు కింద గగ్గోర్లు రావడం)
  • వాంతులు, విరేచనాలు, ఆయసం
  • కండ్లు తిరిగి పడిపోవడం
  • (8-13ఏండ్లలోపు పిల్లలు)
  • బీపీ, పల్స్‌రేట్‌ పడిపోవడం
  • 5 రోజులైనా జ్వరం తగ్గకపోవడం

సకాలంలో ఐవీఐజీ చికిత్స చేయాలి

  • వైరస్‌ వచ్చిపోయిన నెల తర్వాత పిల్లల బాడీలో హైపర్‌ ఇన్‌ఫ్రమెట్రీ సిండ్రోమ్స్‌ ఏర్పడుతున్నాయి.
  • అంటే కొన్ని రకాల రియాక్షన్స్‌ వస్తున్నాయి. వీటితో ఒక్కసారిగా అనారోగ్యానికి గురవుతారు.
  • ఈ రియాక్షన్స్‌ గుండె, ఊపిరితిత్తులతోపాటు కిడ్నీలు, కాలేయం, మెదడు వంటి అవయవాలు ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి.
  • తల్లిదండ్రులు ఇవి సాధారణ లక్షణాలుగా భావిస్తే ప్రమాదకరం.
  • ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే యాంటిబాడీస్‌ పరీక్షలు జరిపిస్తే వారికి పాజిటివ్‌ వస్తుంది.
  • ఇతర మెడికల్‌ టెస్టులు చేసి పిల్లలకు ఎంఐఎస్‌-సీ రియాక్షన్స్‌ను గుర్తిస్తారు.
  • హైపర్‌ ఇన్‌ఫ్రమెట్రీ సిండ్రోమ్స్‌ ఉన్న పిల్లలకు వెంటనే ఐవీఐజీ చికిత్స అందించాలి.
  • ఇందులో ‘ఐవీ ఇమ్యునో గ్లోబ్లిన్‌’ చికిత్స చేస్తారు. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది.
  • దీనికి ప్రత్యమ్నాయంగా స్టెరాయిడ్స్‌ కూడా ఇస్తారు. ఈ చికిత్స సకాలంలో ఇస్తే 98శాతం పిల్లలను రికవరీ చేయవచ్చు.
  • నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది. -డాక్టర్‌ సి. సురేశ్‌కుమార్‌, చిన్నపిల్లల వైద్యనిపుణులు, అపోలో క్రెడల్‌ హాస్పిటల్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పిల్లల్లో ఎంఐఎస్‌ డిజార్డర్‌

ట్రెండింగ్‌

Advertisement