సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫేస్బుక్ హ్యాక్ అయ్యింది. ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. డాలర్లు కావాలంటూ పలువురిని కోరడంతో ఇది సైబర్‌నేరగాళ్ల పనేనని గుర్తించారు. దీంతో ఎంపీ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు మంగళవారం సీసీఎస్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ చాంద్ బాషా నేతృత్వంలోని బృందం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టింది. ఇటీవల ఫేస్బుక్, వాట్సాప్‌లు ఎక్కువగా హ్యాక్ అవుతున్నాయని, అందులో భాగంగానే ఎంపీ ఫేస్బుక్ కూడా హ్యాకింగ్ అయి ఉంటుందని సైబర్‌క్రైమ్ పోలీసులు భావిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు.