కవాడిగూడ, మే 31 : ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను మరిచిందని అన్నారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాచం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, బూర నర్సయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాంచందర్ రావు, మాజీ మంత్రులు కృష్ణ యాదవ్, ఇనుగాల పెద్దిరెడ్డి, కవాడిగూడ కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, నాయకులు ఎం.రమేశ్ రామ్, జి.వెంకటేశ్, సలంద్రి శ్రీనివాస్ యాదవ్, ఎంసీ మహేందర్ బాబు, ఎ.వినయ్ కుమార్, బద్రినారాయణ, నిత్యానంద్, నందగిరి నర్సింహ, మహిళా నాయకురాలు శిల్ప, తదితరులు పాల్గొన్నారు.