రవీంద్రభారతి, మార్చి 22 : బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన 42 శాతం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి అందుకు సహకరించిన అన్ని రాజకీయ పక్షాలకు లాయర్స్ ఓబీసీ లాయర్స్ జేఏసీ అభినందనలు తెలుపుతుందన్నారు.
ఈ మేరకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓబీసీ లాయర్స్ జేఏసీ చైర్మన్ తలకొక్కుల రాజు, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్, ఓబీసీ డిమోట్రిక్ జేఏసీ కన్వీనర్ కోల జనార్ధన్, ఎఎల్పీఏ స్టేట్ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజ్‌గౌడ్ , పూస మల్లేషం, టి.రాహుల్ వంశీకృష్ణ, లాయర్ జాక్ కనీనర్స్ కొండూరి వినోద్‌కుమార్ తదితరులు ప్రసంగించారు.
విద్యా,ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించినందుకు ఓబీసీ లాయర్స్ జేఏసీ అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా త్రికరణశుద్ధితో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి రాష్ట్రపతి చేత ఆమోదం పొందే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. లేని పక్షంలో ఓబీసీ లాయర్స్ జేఏసీ మిగతా ఓబీసీ సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణతో ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు.