హైదరాబాద్ : పెట్రోల్‌లో(Petrol) వాటర్ రావడంతో వాహనదారులు అవాక్కయ్యారు. వెంటనే తేరుకొని ఇదేమిటని బంక్ యజమాని చంద్రశేఖర్‌ను ప్రశ్నిస్తే వాహనాదుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఈ సంఘ టన రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హస్తినాపురంలోని జెడ్పీ రోడ్డులో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకులో(Hastinapuram) మోసం చోటు చేసుకుంది. పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో వాహనదారులు ఖంగుతిన్నారు.
పెట్రోల్ బంకును సీజ్ చేసి వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని బంకు వద్ద ఆందోళన చేపట్టారు. పెట్రోల్‌లో వాటర్ రావడంతో వాహనాలు రిపేర్ అయ్యాయని వాహనదారుల ఆవేదన వ్యక్తం చేశారు. నార్మల్ పెట్రోల్ ఉన్నా, పవర్ పెట్రోల్ మాత్రమే సప్లై చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెట్రోల్‌లో వాటర్ రావడంతో అవాక్కైన వాహనదారులు
ఇదేమిటని బంక్ యజమాని చంద్రశేఖర్ ను ప్రశ్నిస్తే దురుసు ప్రవర్తన.
రంగా రెడ్డి జిల్లా హస్తినాపురం ZP రోడ్డులో ఉన్న HP పెట్రోల్ బంకులో మోసం. పెట్రోల్ బంకును సీజ్ చేసి వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని బంకు వద్ద ఆందోళన.
పెట్రోల్‌లో… pic.twitter.com/Qas0NPPdEF
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2024