Traffic Jam | పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తుంటే ఎలా.. సీఎం రేవంత్ రెడ్డి వల్ల ట్రాఫిక్ జామ్‌పై వాహనదారులు.. వీడియో
Traffic Jam | సీఎం రేవంత్ రెడ్డి తరచూ నార్సింగి, గచ్చిబౌలి, జన్వాడ తదితర ప్రాంతాలలోని కన్వెన్షన్ సెంటర్లకు జరుగుతున్న పెళ్లిళ్లకు, ఇతర చిన్నపాటి కార్యక్రమాలకు కూడా ఔటర్ రింగ్ మార్గం గుండా వెళ్తుండడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది.
Traffic Jam | మంత్రులు, సీఎంల కాన్వాయ్‌లు వస్తుంటే ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపేయడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే సీఎం వస్తున్నాడన్న కారణంతో పదే పదే రోడ్లపై పడిగాపులు కాసేలా చేస్తే.. అది కూడా మండుటెండలో వాహనదారులను ట్రాఫిక్‌లో నిలిపేస్తే ఎలా ఉంటుంది. సీఎం రాకతో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని వాహనదారులు ఆగ్రహావేశాలను లోనయ్యారు.
ఈ ఘటన ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వివాహాది కార్యక్రమాలకు వస్తున్నాడని గంటకు పైగా వాహనాలను నిలిపివేశారని ప్రజలు మండిపడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తరచూ నార్సింగి, గచ్చిబౌలి, జన్వాడ తదితర ప్రాంతాలలోని కన్వెన్షన్ సెంటర్లకు జరుగుతున్న పెళ్లిళ్లకు, ఇతర చిన్నపాటి కార్యక్రమాలకు కూడా ఔటర్ రింగ్ మార్గం గుండా వెళ్తుండడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై హారన్లు కొట్టి నిరసన తెలిపారు.
ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధి నిత్యం పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్తుంటే పోలీసులు వాహనాలను గంటలు గంటలు ఆపుతున్నారని వాహనదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనులలో బయటకు వెళ్లే వారి పరిస్థితి దయనీయంగా మారిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ వైపు నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు అంటూ అబద్ధపు ప్రకటనలు ఇస్తూనే.. మరోవైపు తరచూ ఇలా ట్రాఫిక్‌ను ఆగిపోయేలా చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నాడంటూ వాపోతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని గంట సేపు ట్రాఫిక్ ఆపితే ఎట్లా!
రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై హారన్లు కొట్టి వాహనదారుల నిరసన
ఓవైపు నాకోసం ట్రాఫిక్ ఆపొద్దు అంటూ అబద్ధపు ప్రకటనలు ఇచ్చి మరోవైపు ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం
ఆదివారం ఉదయం… pic.twitter.com/KxLnULsz7t
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2026
Read Also :
Suryapeta | హుజురాబాద్‌లో బాలుడు అనుమానస్పదస్థితిలో మృతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

