హయత్‌నగర్, అక్టోబర్ 27 : ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్‌కు చెందిన మార్దీప్ సింగ్ దయాసింగ్, కిరణ్ కౌర్ దంపతులు. వీరి పిల్లలు అమన్ జిత్, జాస్మిత్, సిమ్రాన్. వీరు హయత్‌నగర్‌లోని జీ స్కూల్ సమీపంలో నివాసముంటున్నారు.
కిరణ్ కౌర్, తన ముగ్గురు పిల్లలతో కలిసి పది రోజుల కిందట ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. ఆందోళనకు గురైన మార్దీప్ సింగ్ దయాసింగ్ వారి కోసం చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.