చర్లపల్లి, ఏప్రిల్ 26: కక్షిదారులకు సత్వర న్యాయం జరగాలంటే మరిన్ని నూతన కోర్టుల ఏర్పాటు అవసరమని హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలోని మేడ్చల్, మల్కాజిగిరి కోర్టులో 2వ అదనపు జిల్లా కోర్టును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎన్.శ్రీదేవి, అదనపు జిల్లా న్యాయమూర్తి రఘునాధ్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రధాన కారదర్శి బాపిరెడ్డి, మాజీ అధ్యక్షుడు రవికాంత్‌గౌడ్, న్యాయవాదులు.. సుధీర్, ఎల్లా మోహన్, భాస్కర్ పాల్గొన్నారు.