బండ్లగూడ, జూలై 13: దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా గూడురు మండలం, శీలాపూర్ గ్రామానికి చెందిన జోగు మల్లేశం ఈనెల 11న తోలుకట్ట కూలీల అడ్డా నుంచి ఓ మహిళను పని ఉందని చెప్పి తన బైక్‌పై తీసుకెళ్లి.. ఆమె చెవి కమ్మలు, బంగారంతో పాటు ఆరువేల నగదు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
జోగు మల్లేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. అతడిపై చేవెళ్ల, శంకర్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను టార్గెట్ చేసుకొని పని పేరుతో కూలీల అడ్డా నుంచి తీసుకెళ్లి దోచుకుంటున్నాడని ఏసీపీ తెలిపారు. కూలీల అడ్డాలపై మహిళలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.