Azaharuddin | అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతున్నట్లు సర్వే రిపోర్టులు రావడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా, అజారుద్దీన్ మంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి,