చర్లపల్లి, జనవరి 6 : 430 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజేయ్, మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ వచ్చే ఐదేండ్లలో జాతీయ రహదారులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ గడిచిన పది సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి సాధించిందని నూతన స్టేషన్ల అధునీరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. అనంతరం స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన రైళ్లను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.