Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షాలు ముంచెత్తాయి. నిన్నటి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం మధ్యాహ్నం సమయంలో కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
కూకట్పల్లి, మూసాపేట్, జేఎన్టీయూ, నిజాంపేట, ఇంద్రానగర్, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, పంజాగుట్ట, కోఠి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, మారేడుపల్లి, చిలకలగూడ, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, రాజేంద్రనగర్, కిస్మత్ పురా, కాళీమందిర్, గండిపేట్, అత్తాపూర్, బంజారాహిల్స్, మాదాపూర్, రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
మరో రెండు గంటల్లో కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, అల్వాల్, కాప్రా, మల్కాజ్గిరి, ఉప్పల్, నాగోల్, హెటైక్ సిటీ ఏరియాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు.