సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. దీంతో పగలు, రాత్రి సమయాల్లో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.0 డిగ్రీలు, గాలిలో తేమ 51శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.