దుండిగల్,సెప్టెంబర్5: భారత ప్రభుత్వ విద్యా శాఖ విడుదల చేసిన నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)-2025, ఇంజినీరింగ్ విభాగంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల 201-300 బ్యాండ్‌లో స్థానం దక్కించుకుంది. విద్యానైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలల్లో విద్యార్థులు సాధించిన విజయానికి ఈ ర్యాంకింగ్ లభించినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి.
5వ సారి ఈ ప్రత్యేకతను సాధించడం ద్వారా ఎంఎల్ఆర్ఐటీ కళాశాల దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఒకటిగా నిలువడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాల అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా.కే.శ్రీనివాసరావు, కళాశాల వైస్‌చైర్మన్ మర్రి ధీరేన్రెడ్డి, డైరెక్టర్ అనుశ్రేయారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
సమిష్టి కృషి ఫలితమిది
ఎంఎల్ఆర్ఐటీ కళాశాల 5వ సారి నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్‌వర్క్ ర్యాంకింగ్‌లో స్థానం సంపాదించడం తనకు గర్వంగా ఉందన్నారు. విద్యా నైపుణ్యం, పరిశోధనతో పాటు ఎంఎల్ఆర్ఐటీ చేసిన నిరంతర ప్రయత్నానికి ఈ గుర్తింపు లభించినట్లు మర్రి రాజశేఖర్‌రెడి తెలిపారు. పరిశ్రమల ఆధారిత అభ్యాసం, నైపుణ్యాధారిత విద్యపై బలమైన దృష్టితో ఆవిష్కరణల ఆధారిత వృద్ధిలో తమ కళాశాల నిరంతర ఉన్నత ప్రమాణాలను కొనసాగిస్తుందని చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, పూర్వవిద్యార్థులు, పరిశ్రమల ప్రతినిధుల నిరంతర కృషితోనే ఎంఎల్ఆర్ఐటీ కళాశాలకు ఈ గుర్తింపు లభించిందన్నారు.