కుత్బుల్లాపూర్/దుండిగల్: ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన నాయకులు ఆయనను వెంటనే కొంపల్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
వైద్యపరీక్షల అనంతరం వైద్యులు శంభీపూర్‌రాజును కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దగ్గరుండి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం శంభీపూర్ రాజును నివాసానికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అభిమానులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఆయన నివాసంలో పరామర్శించారు.