అబిడ్స్, మే 11: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో కోతలు లేని విద్యుత్, ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరా జరిగేదని ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, ఎంఎస్ ప్రభాకర్‌రావు, నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్ ఆనంద్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం నాంపల్లి నియోజకవర్గంలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ విద్యుత్, మంచినీటి సమస్యలు పునరావృతమవుతున్నాయని చెప్పారు. సీఎంగా కేసీఆర్ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.