సిటీబ్యూరో/కార్వాన్: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించే ఈ సభను చరిత్రలో నిలిచిపోయే రోజుగా మలుద్దామని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ పిలుపునిచ్చారు. కార్వాన్ నియోజకవర్గంలోని రాంసింగ్ఫురాలో జరిగిన భారీ సన్నాహక సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి శ్రవణ్ మాట్లాడారు.
బీఆర్ఎస్ పదేండ్ల అభివృద్ధి పాలనను, కాంగ్రెస్ సర్కారు విధ్వంసాన్ని ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. రాష్ర్టాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సంక్షోభంలోకి నెట్టేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు జీవన్‌సింగ్, శ్రీనివాస్ గుప్తా, శేఖర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.