బోనాల్లో పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావాలి
ఆషాఢ మాసం అంటేనే బోనాల ఉత్సవాలకు పెట్టింది పేరని సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గం పరిధి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు.
- ఉత్సవాలకు వచ్చే భక్తులు అసౌకర్యానికి కలగకుండా చూడాలి
- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
బేగంపేట్, జూన్ 30: ఆషాఢ మాసం అంటేనే బోనాల ఉత్సవాలకు పెట్టింది పేరని సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గం పరిధి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం, సికింద్రాబాద్ బోనాలు – జాతరను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా జూలై 9న జరిగే బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం, 21, 22న జరిగే సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే విధంగా అధికారులకు పరస్పర సహకారం అందిస్తామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, గత ప్రభుత్వం మంజూరు చేసిన అనేక అభివృద్ధి పనులను చేపట్టకుండా ప్రజా సమస్యల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆషాఢ మాసం అనంతరం, పాదయాత్రకు రూప కల్పన చేస్తామని తెలిపారు. సమస్యలపై ప్రజా క్షేత్రంలో పోరాడుదామని పిలుపునిచ్చారు.
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు…
తన సోదరుడు శంకర్ యాదవ్ మరణ విషాదం నుంచి తాము ఇంకా కోలుకోలేదని తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శంకర్ యాదవ్‌తో తనకున్న ప్రత్యేక బంధం సికింద్రాబాద్ ప్రజలందరికి తెలిసిందేనన్నారు. తన కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉన్నదని ఆ కారణంగానే రాజకీయ పరమైన కార్యకలాపాలలో పాల్గొనలేక పోతున్నట్టు వివరించారు. కానీ, తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని అయోమయానికి గురి కావొద్దని కోరారు. ఈ క్రమంలో శంకర్ యాదవ్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, కొలను లక్ష్మి, హేమలత, మాజీ కార్పొరేటర్లు శేషు కుమారి, డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేశం రాజు, లక్ష్మీపతి, ఏసూరి మహేశ్, గులాబ్ సింగ్, ప్రేమ్ కుమార్, కిశోర్ కుమార్, ఆంజనేయులు, అఖిల్, శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

