MLA Thalasani | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాలువ నిర్మాణాలను చేపట్టాం : ఎమ్మెల్యే తలసాని
MLA Thalasani | ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) పేర్కొన్నారు.
బేగంపేట్, మార్చి 5 : ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) పేర్కొన్నారు. మంగళవారం బేగంపేట్ డివిజన్లోని పీజీరోడ్డులోని(VDCC road) డిమ్మీ పాన్ షాప్ నుంచి జవహర్‌నగర్ వరకు రూ. 32 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పీజీ రోడ్డులో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వరదనీటి కాలువ నిర్మాణాలను చేపట్టామన్నారు. ఇవే కాక చక్కటి వైట్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అత్తెల్లి శ్రీనివాస్‌గౌడ్, శ్రీహరి, ప్రవీణ్, కిశోర్, సంజయ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

