బేగంపేట్ జూలై 19: తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బోనాల ఉత్సవాల విశిష్టతను విశ్వవాప్తం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు సేవలు అందించే దక్కన్ మానవసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభు త్వం లో బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చి న విషయాన్ని గుర్తు చేశారు.
అమ్మవారి ఆలయాన్ని పరిసరాలను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి జాతరను ఐఖ్యతతో ఘనంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పిల్లి శ్రీనివాస్, అత్తెల్లి మల్లిఖార్జున్‌గౌడ్,రఘుమోహన్, శ్రీనివాస్,కమల్‌కుమార్,అత్తెల్లి శ్రీనివాస్‌గౌడ్, కిషోర్‌కుమార్, నాగులు, కోటేశ్వర్‌గౌడ్,ధరంచౌదరి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.