పోలీస్ అలవెన్స్లు 1.60 కోట్లు
‘బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి నిబంధనల ప్రకారం అలవెన్సులు చెల్లించాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1.60 కోట్లను ఖాతాల్లో జమ చేశాం’ అని హైదరాబాద్ సిటీ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ‘బందోబస్తు ఫుల్.. అలవెన్స్లు నిల్' అని ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ప్రత్యేక కథనానికి పోలీస్ శాఖ స్పందించింది.
- రెండు విడతల్లో సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ
- భోజనం, వసతి, బసలో లోటుపాట్లు ఏమీలేవు
- ‘నమస్తే’ కథనానికి పోలీస్ శాఖ స్పందన
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి నిబంధనల ప్రకారం అలవెన్సులు చెల్లించాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1.60 కోట్లను ఖాతాల్లో జమ చేశాం’ అని హైదరాబాద్ సిటీ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ‘బందోబస్తు ఫుల్.. అలవెన్స్లు నిల్’ అని ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ప్రత్యేక కథనానికి పోలీస్ శాఖ స్పందించింది. బందోబస్తు విధులకు హాజరైన సిబ్బంది 13 రోజుల విధి నిర్వహణకు పూర్తి అలవెన్స్లను మొదటి విడతలోనే చెల్లించినట్టు పేర్కొన్నారు. రెండో విడతలో 5 రోజుల విధులకు పూర్తి అలవెన్సులనూ సకాలంలో విడుదల చేసినట్టు తెలిపారు.
వినాయక చవితి, నిమజ్జన బందోబస్తు సేవల కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాలు/యూనిట్ల నుంచి మొత్తం 9,295 మంది సిబ్బంది హైదరాబాద్ కమిషనరేట్లో విధులకు హాజరయ్యారని, వీరిలో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంక్ వరకు 7,825 మంది అధికారులు ఉండగా, 1,470 మంది హోమ్గార్డులు ఉన్నారని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి భోజనం, మంచినీరు, తాతాలిక బస/విశ్రాంతి వసతి, రవాణా సదుపాయాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమకూర్చినట్టు తమ వివరణలో పేర్కొన్నారు. భోజనం, వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని అనడంలో నిజంలేదని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో, లక్షలాది మంది భక్తులు పాల్గొన్న గణేశ్ ఉత్సవాలను అత్యంత ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయడంలో పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేశారని కితాబునిచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

