బొల్లారం,ఆగస్టు 17 : కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్యారసాని గౌరీ శంకర్‌ను మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. గౌరీ శంకర్ సతీమణి, బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ మాతృమూర్తి కమలాదేవి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందింది.
ఆదివారం తలసాని శ్రీనివాస్ యాదవ్ లాల్‌బజార్‌లోని వారి నివాసానికి వెళ్లి గౌరీ శంకర్, శ్యామ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఎమ్మెల్యే తలసాని వెంట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ, యశ్వంత్ తదితరులు ఉన్నారు.