వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలి
బేగంపేట్ పాటిగడ్డలో రూ. 6 కోట్ల వ్యయంతో జి+2లో నిర్మితమవుతున్న మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ పనులు తుది దశకు చేరుకున్నాయని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మిగిలిన పనులను కూడా పూర్తి చేసి వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
- సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
బేగంపేట్, జనవరి 12 : బేగంపేట్ పాటిగడ్డలో రూ. 6 కోట్ల వ్యయంతో జి+2లో నిర్మితమవుతున్న మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ పనులు తుది దశకు చేరుకున్నాయని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మిగిలిన పనులను కూడా పూర్తి చేసి వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శుక్రవారం బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, వివిధ శాఖల అధికారులతో కలిసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. లిఫ్ట్ ఏర్పాటుతో పాటు డ్రైనేజీ పనులు మిగిలిపోయాయని కార్పొరేటర్ మహేశ్వరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ పనులను పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను పేదలకు నామమాత్రపు ఫీజుకే అద్దెకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వడ్డెర బస్తీలో సీసీ రోడ్డు నిర్మాణాలు, దేవిడిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు, బేగంపేట్ ఓల్డ్ కస్టమ్స్ బస్తీలోని ఖబరస్థాన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
కార్యక్రమంలో జలమండలి డీజీఎం శశాంక్, జీహెచ్ఎంసీ డీఈ సంతోష్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ ఏఈ తిరుమలేశ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్ నాయీ, శేఖర్, ఆరిఫ్, అఖిల్, మొయిన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

